ఆత్మీయంగా మెలిగింది. కష్టసుఖాలు పంచుకుంది. తీరా చూస్తే, ఆ కిలేడీ ఇంట్లో వాళ్లను నమ్మించి నగలు కాజేసింది. ఈ ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.
నగరంలోని కుమార్ గల్లి కి చెందిన గంగావిషన్ తన ఇంటి కింద ఓ బ్యూటీ పార్లర్ కు రెంట్ కు ఇచ్చినట్లు తెలిపారు.బ్యూటీ పార్లర్ లో పని చేస్తున్న గాయత్రి అనే మహిళ పై అంతస్తులో ఉన్న ఇంటి యజమానులతో స్నేహం కుదుర్చుకుంది.
నమ్మకంతో ఇంట్లోకి రానిచ్చిన స్నేహితురాలే సుమారు 18 తులాల బంగారు నగలను,కిలో పావు వెండి,కొంత నగదును ఈ నెల 13న కాజేసినట్లు తెలిపారు.తీర శుక్రవారం కుటుంబ సభ్యులు ఇంట్లోని బీరువా తెరిచి చూడగా అందులో ఉండాల్సిన సుమారు బంగారు ఆభరణాలు,వెండి,నగదు కన్పించలేదు.
దీంతో వారు కంగారు పడ్డారు. హుటాహుటిన ఒకటవ టౌన్ లో ఫిర్యాదు చేశారని అన్నారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు.
