HomeCRIMEగంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..

గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..

మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి జిల్లాలోని విక్రయిస్తున్న నిందితులను పట్టుకొని అరెస్టు చేసినట్లు సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ తెలిపారు.మోపాల్ మండలం కంజర్ గ్రామ శివారులో గంజాయి అమ్ముతున్నారనే సమాచారం రావడంతో మోపాల్ ఎస్సై సుష్మిత వెంటనే తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు.

అక్కడ అనుమానాస్పదంగా ఉన్న వినాయక్ నగర్కు చెందిన అమీర్ ఖాన్, నర్సింగ్పల్లికి చెందిన షేక్ అఫ్రోజ్, కంజర్కు చెందిన శివతేజలను అదుపులోకి తీసుకున్నారు.ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా ముగ్గురు నిందితులు నాందేడ్ వెళ్లి గంజాయి తీసుకు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

నాందేడ్ కు చెందిన షేక్ ఇమ్రాన్, మిర్జా జుబేర్ బేగ్ అనే వ్యక్తుల నుంచి గంజాయిని కిలోకు రూ.10 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దానిని మోపాల్ తీసుకొచ్చి 5 గ్రాముల చొప్పున విక్రయిస్తున్నారు. 5 గ్రాముల ప్యాకెట్ను రూ.200 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు.

దీంతో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మోపాల్ ఎస్ఐ సుస్మిత తన బృందం తో నాందేడ్ వెళ్లి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి గంజాయి అమ్ముతున్న షేక్ ఇమ్రాన్, మిర్జా జుబేర్ బేగ్ తో పాటు మరో ఇద్దరు నిందితులు అముల్ చౌరే, షేక్ షేర్ ఖాన్లను అదుపులోకి తీసుకున్నారు.

మొత్తం ఏడుగురు నిందితులను కేసులో అరెస్ట్ చేశారు. కంజర్లో దొరికిన ముగ్గురు నిందితుల వద్ద సుమారు 1.2 కిలోల గంజాయి, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

నాందేడ్లో అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి 900 గ్రాముల గంజాయి, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసు ఛేదించిన సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్,మోపాల్ ఎస్ఐ సుస్మిత,సిబ్బందిని సిపి అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments