HomeCRIMEఫోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన..

ఫోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన..

సమాజంలో పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, ముఖ్యంగా ఆడపిల్లలు ఎదురవుతున్న వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ నాలుగో టౌన్ సీఐ సతీష్ పేర్కొన్నారు. గురువారం నాడు స్థానిక పాఠశాల ఆవరణలో ఫోర్త్ టౌన్ పోలీస్ సిబ్బంది, షీ టీమ్, భరోసా సెంటర్ బృందం సంయుక్తంగా ‘ఫోక్సో చట్టం – బాలల రక్షణ’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

చిన్న వయసు నుంచే పిల్లలు ఎవరైనా తాకినప్పుడు అది ఏ ఉద్దేశంతో చేస్తున్నారో గుర్తించాలని షీ టీం సభ్యులు వివరించారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే భయపడకుండా తల్లిదండ్రులకు లేదా ఉపాధ్యాయులకు తెలపాలని సూచించారు. మైనర్లపై జరిగే లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫోక్సో చట్టం గురించి షి టీమ్ ఎస్సై వివరించారు.

ఈ చట్టం కింద నేరస్థులకు పడే కఠిన శిక్షల గురించి అవగాహన కల్పించారు. బాధితులకు అండగా ఉండేందుకు నిజామాబాద్ భరోసా సెంటర్ అందించే ఉచిత కౌన్సెలింగ్, వైద్య, న్యాయ సహాయం గురించి సెంటర్ ప్రతినిధులు తెలియజేశారు.ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే 100 లేదా షీ టీం వాట్సాప్ నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. “మీ రక్షణే మా ప్రాధాన్యత” అని వారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోర్త్ టౌన్ పోలీస్ సిబ్బంది, భరోసా సెంటర్ కౌన్సిలర్లు, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments