పేకాట స్థావరం పై మెరుపు దాడి చేసి ఎనిమిది మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ సార్ ఆధ్వర్యంలో మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ లో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు స్థావరం పై రైడ్ చేసి 8గురు పేకాట రాయుళ్ళు 8సెల్ ఫోన్, నగదు22690/- స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
