నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో కొత్త ఉత్సాహం నింపేలా.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్ రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణలు రాష్ట్ర రాజధానిలో పర్యటించారు.
తమ నియామకం అనంతరం మర్యాదపూర్వకంగా పార్టీ అధిష్టాన పెద్దలను, ప్రభుత్వ కీలక నేతలను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. భవిష్యత్తు కార్యాచరణ ముందుగా ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను కలిసిన వారు, జిల్లాలో పార్టీ స్థితిగతులపై ప్రాథమికంగా చర్చించారు.
అనంతరం ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులు, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు వేం నరేంధర్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిజామాబాద్ జిల్లాను అగ్రస్థానంలో నిలుపుతామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.
అలాగే యువనేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను కలిసి యువజన విభాగాలను బలోపేతం చేయడంపై చర్చించారు. ఈ భేటీలో నూతన అధ్యక్షుల వెంట మాజీ ఎన్ఎస్ యుఐ, యువజన కాంగ్రెస్ కీలక నేతలు గన్ రాజ్, పంచరెడ్డి చరణ్లు ఉన్నారు.
