HomeTelanganaNizamabadTRESAఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్న క్రిస్మస్ వేడుకలు

TRESAఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్న క్రిస్మస్ వేడుకలు

ఈరోజు నూతన కలెక్టర్ భవనంలో గల IDOC మీటింగ్ హాల్ లోని రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ TRESA అధ్యక్షులు రమన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్రిస్మస్ సెలబ్రేషన్ ఘనంగా జరిగింది .

ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి TRESA అధ్యక్షులు రమణ రెడ్డి గారు మాట్లాడుతూ జీసస్ ప్రభువైన ఏసుక్రీస్తు ఒక నీతి మార్గంలో నడవాలని ప్రజలందరూ ప్రేమ సంతోషములతో వర్ధిల్లాలని ఆయన తపన పడ్డారని మనుషులందరూ అన్యోన్యంగా కలిసి ఉండాలని కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ బ్రతకాలని ఒక మంచి మార్గం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడని కాబట్టి ప్రతి మనుషుడు కూడా జీవితాన్ని సంతోషమైన జీవితాన్ని మంచి మార్గాన్ని ఎంచుకొని నడవాలని అప్పుడు ఈ ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు.

అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారు కూడా జీసస్ మార్గంలో సత్యము ఉంది గనుక ప్రజలందరూ మంచి మార్గంలో ఉన్నట్లయితే ప్రజలు సుఖశాంతులతో ఉంటారని అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

కలెక్టరేట్ AO ప్రశాంత్ కుమార్ ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తూ జీసస్ ఈ లోకంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారని తెలియజేశారు.

ఈ యొక్క కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు పి శ్రీనివాస్ రావు కోశాధికారి విజయ్ కాంత్ రావు ఉపాధ్యక్షులు భూపతి ప్రభువు కలెక్టరేట్ సూపరిండెంట్ బాలరాజు అధికారులు IDOC లోని అన్ని శాఖల ఉద్యోగులు పాల్గొని విజంతం చేసినారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments