నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం భాజపాకు అనుకూలంగా కనిపిస్తోంది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన కౌంటింగ్లో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఇందులో బీజేపీ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. నగరపాలక పరిధిలో మొత్తం 1524 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా, అత్యధికంగా భాజపాకు 755 ఓట్లు లభించాయి.
ఇక అధికార పార్టీ కాంగ్రెస్ 476ఓట్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కేవలం 67 ఓట్లకే పరిమితం కాగా, ఎంఐఎం 95 ఓట్లను దక్కించుకుంది.చెల్లనటువంటి ఓట్లు 21, నోటకు 9 ఓట్లు దక్కాయి.
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావడంతో అధికారులు ఇప్పుడు సాధారణ ఓట్ల లెక్కింపును వేగవంతం చేశారు. 60 డివిజన్లలో హోరాహోరీగా సాగిన పోలింగ్లో గెలుపు గుర్రాలు ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
