Monday, April 20, 2026
HomeTelanganaNizamabadనగరంలో భారీగా నష్ట పోయిన గులాబీ పార్టీ ……..మైనార్టీ ఏరియా ల్లో కాంగ్రెస్ పాగా ……..

నగరంలో భారీగా నష్ట పోయిన గులాబీ పార్టీ ……..మైనార్టీ ఏరియా ల్లో కాంగ్రెస్ పాగా ……..

పదేళ్లు ప్రభుత్వంలో వుండగా వరుసగా రెండు సార్లు మేయర్ పీఠం దక్కించుకున్న గులాబీ పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో దయనీయ పరిస్థితి ఎదుర్కొంది. ఒక్క స్థానానికే పరిమితం అయింది. కానీ ఆ ఒక్క స్థానం తోనే మేయర్ ఎన్నికలో కీలకంగా పనిచేసింది. మున్సిపల్ ఎన్నికల పక్రియ మొదలవ్వక ముందే కీలక నేతలు ఎన్నికలకు ముందే బీజేపీ కాంగ్రెస్ పార్టీల్లో కి వెళ్లి పోవడంతో ఆ భారీగా నష్ట పోయింది.

కొన్ని డివిజన్ లలో బలమైన అభ్యర్థులు లేక పోవడంతో దిక్కులు చూడాల్సిన దుస్థితి తలెత్తింది.నగరంలోని 60 డివిజన్ లలో డజన్ మేరకు డివిజన్ ల్లో అభ్యర్థులు వందలోపే వోట్లు సాధించారు. రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచిన అర్బన్ లో గత అసెంబ్లీ ఎన్నికలో చేదు ఫలితాలు చూసింది అప్పటి నుంచే ఆ పార్టీ నగరంలో ప్రతికూల పరిస్థితి ఎదుర్కొంటుంది.

ఒక్క డివిజన్ లో గెలిచి మరో రెండు డివిజన్ ల్లో గట్టి పోటీ ఇచ్చింది మిగితా డివిజన్ లలో కనీస పోటీ ఇవ్వలేక పోయింది. నిజానికి జిల్లాలో మిగితా మున్సిపాలిటీ ల్లో బిఆర్ యస్ గట్టిగానే పోటీ ఇచ్చింది అధికార పార్టీని తట్టుకొని నిలబడింది బీజేపీ తో పోటాపోటీగా ఫలితాలు సాధించింది. బోధన్ ఆర్మూర్ బీమ్ గల్ మున్సిపాల్టీ ల్లో ఓడిపోయిన స్థానాల్లో వోట్లు బాగానే రాబట్టింది.

కానీ నిజామాబాద్ నగరంలోనే బిఆర్ యస్ కు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే అన్ని తానై ప్రచారం చేసినా ఫలితాలు ఆశించిన మేరకు రాకపోవడం గమనార్హం . పదేళ్లలో ఎమ్మెల్యే నగర అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయలు తెచ్చింది బిగాల ఏకరువు పెట్టారు. అయినప్పటికి నా మాత్రంగా ఫలితాల రావడం గులాబీ నేతలకు మింగుడు పడడం లేదు.

ముఖ్యంగా మైనార్టీ ఏరియాలో పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బ తింది అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్ అలీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న 60 శాతం మేరకు మైనార్టీ లు వోట్లు వేశారు. ఈసారి పూర్తిగా నిరాదరణ కు గురయ్యారు 2020 మున్సిపల్ ఎన్నికల్లో యంఐయం ప్రభంజనం బీజేపీ ల ప్రభంజనాలున్న సరే బిఆర్ యస్ 22 శాతం వోట్లు సాధించి 13 డివిజన్ లు గెలిచింది కానీ కాంగ్రెస్ మూడు శాతం ఓట్లతో జస్ట్ రెండు స్థానాలు దక్కించుకుంది.

కానీ ఈసారి బిఆర్ యస్ 18 273 వోట్లతో 8 87 శాతం వోట్లు సాధించింది గతంతో పోల్చితే బీజేపీ సైతం దాదాపు పది శాతం వోట్లు కోల్పోయింది కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏకంగా 34 శాతం వోట్లు సాధించింది. ముఖ్యంగా యంఐయం ప్రాబల్యం ను సైతం కాంగ్రెస్ నిలువరించింది ఏకంగా నాలుగు డివిజన్ ల్లో యంఐయం అభ్యర్థులను ఓడించింది.

గతంలో బిఆర్ యస్ కు వైపు వోట్లు వేసిన ముస్లిం వోటర్లు సారి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను సైతం గట్టిగానే ఆదరించారు అదీగాక మైనార్టీ ఏరియా ల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థుల గెలుపు కోసం కనీసం కార్యాచరణ ఆమలు చెయ్యలేదు ఎదో మొక్కుబడి గా ఆర్థిక సహాయం చేసి చేతులు ఎత్తేసింది అగ్ర నేతలు అసలు ఎన్నికల ప్రచారం లో ఆ వైపు కన్నెత్తి చూడలేదు అయినా సానుకూల ఫలితాలు సాధించింది బారీగా బిఆర్ యస్ ఓట్ల ను గండి కొట్టింది.

దీనికి తోడు బిఆర్ యస్ కు చెందిన కీలక నేతలు అందులోనూ బిగల కొటారి గా ముద్ర ఉన్న నేతల్లో కొందరు కాంగ్రెస్ యంఐయం లోకి జంప్ కాగా మరికొందరు చివరిలో తమ బంధువులను కాంగ్రెస్ లోకి పంపి అభ్యర్థులుగా రంగంలోకి దించారు దీనితో వారు బయట కారు గుర్తు అంటూ లోలోపల మాత్రం కాంగ్రెస్ కు వోట్లు వేయాలంటూ మంత్రాంగం నడిపారు.

మరో వైపు ఎన్నికల ప్రచారం విస్తృతంగా నే చేసిన బిఆర్ యస్ అభ్యర్థులకు చిల్లి గవ్వ ఆర్థిక సహాయం అందక పోవడంతో వోట్లు ను గంప గుత్తగా రాబట్టలేక పోయారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!