Saturday, April 18, 2026
HomeTelanganaNizamabadరెండవ విడతలోనూ హస్తం హవా..గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ …..బీఆర్‌ఎస్‌కు నామ మాత్రమే

రెండవ విడతలోనూ హస్తం హవా..గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ …..బీఆర్‌ఎస్‌కు నామ మాత్రమే

రెండో దఫా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆదివారం రాత్రి నుంచి వెలబడుతున్నాయి నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ పరిధి లోని పది మండలాల్లో 196 సర్పంచ్ స్థానాలలో 38 ఏకగ్రీవం కాగా 158 స్థానాలకు ఆదివారం ఉదయం పోలింగ్ జరిగింది ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకు 57 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపు ముంగిట ఉన్నారు కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది.

బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది బిఆర్ యస్ నామ మాత్రంగా ఫలితాలు సాధిస్తుంది . రెండో విడతలో ఎన్నికలు జరిగిన నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని జక్రాన్పల్లి, డిచ్ పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలం లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ ఏకపక్ష ఫలితాలను నమోదు చేసి, తన పూర్వ వైభవాన్ని చాటుకుంది. మొదటి విడత ఫలితాలకు కొనసాగింపుగా, రెండో దఫాలోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అధిక సంఖ్యలో గెలుపొందారు.

ముఖ్యంగా, జిల్లాలోని ప్రతిష్ఠాత్మకమైన మేజర్ గ్రామ పంచాయతీలన్నింటినీ హస్తం పార్టీకి చెందిన వారే కైవసం చేసుకోవడం ప్రస్తుత రాజకీయ పరిణామాలకు అద్దం పడుతోంది. క్షేత్ర స్థాయిలో బలమైన పోటీనిస్తుందని భావించిన అధికార బీఆర్‌ఎస్ పార్టీ ఈ పోలింగ్‌లో నామమాత్రంగా ఫలితాలు సాధించి వెనుకంజ వేసింది.

జిల్లాలో రెండో విడత ఎన్నికల కోసం మొత్తం 196 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో ఏకగ్రీవాల సంఖ్య గతం కంటే మెరుగ్గా 38కి చేరింది. మిగిలిన 158 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఈసారి భారీగా పోలింగ్ శాతం నమోదు అయ్యింది.


రెండవ దఫా ఎన్నికలు జరిగిన గ్రామాలన్నీ జక్రాన్పల్లి, డిచ్ పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలాల పరిధిలో ఉన్నాయి. ఈ మండలాల్లో మెజారిటీ పంచాయతీలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులు ఉప్పొంగిపోతున్నాయి. పదేళ్ల తర్వాత వచ్చిన ఈ సానుకూల ఫలితాలు జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావడానికి గట్టి పునాదిగా నిలుస్తాయని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!