HomeCRIMEనిజామాబాద్ టౌన్ ఏసిపి గా ప్రకాష్..

నిజామాబాద్ టౌన్ ఏసిపి గా ప్రకాష్..

నిజామాబాద్‌ టౌన్ డివిజన్‌ నూతన అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీగా బి. ప్రకాష్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఇక్కడ ఏసీపీగా విధులు నిర్వహించిన రాజా వెంకటరెడ్డి హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సైబరాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ ఏసీపీగా పనిచేస్తున్న బి. ప్రకాష్‌ బాధ్యతలు స్వీకరించారు.

పోలీస్‌ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు సిబ్బంది, తోటి అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.బాధ్యతల స్వీకరణ అనంతరం ఏసీపీ ప్రకాష్‌ మీడియాతో మాట్లాడారు.

నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. నగరంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments