ఆరేళ్లుగా గా ప్రేమించి పెండ్లి చేసు కుందామని చెప్తే ఎన్నో ఆశలతో విలువైన ఉద్యోగం వదిలేసి విదేశాల నుంచి వచ్చిన ఆ యువకుడ్ని కాదని మరో వ్యక్తి తో పెండ్లి చేసుకొని వెళ్లి పోయింది పెండ్లి కల చెదిరిపోయి ప్రేమ పేరుతొ యువతి చేసిన ఘాతుకం తో జీర్ణించుకోలేక పోయాడు ప్రేమ పెండ్లి వికటించడం తో తట్టుకోలేక పోయాడు చివరికి తనువు చాలించాడు.
యువకుడు విగతి జీవి గా మారడాన్ని గ్రామస్థులు తట్టుకోలేక పోయారు ఆగ్రహం రోడ్డెక్కారు యువకుడు మృతదేహం తెచ్చి నేరుగా పోలీస్ వాహనం మీదే ఇక్కించారు.
ఎరుగట్ల మండలం దోమచంద్ గ్రామానికి చెందిన నాగి రెడ్డి శ్రీకాంత్ రెడ్డి ( 29 )ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డాడు ఇక్కడ ఉన్నపుడే అంటే ఆరేళ్ళ క్రితం తన సామాజిక వర్గం కు చెందిన ఏర్గట్ల గ్రామానికి చెందిన ఓ అమ్మాయి తో ప్రేమ లో పడ్డాడు. కుటుంబ సభ్యులుసైతం వీరిద్దరి ప్రేమ కు సానుకూలత వ్యక్తం చేసారు ఇంకేముంది ప్రేమించి అమ్మాయి తో పెండ్లికి లైన్ క్లియర్ అయిందని ఎంతో సంబర పడ్డాడు ఆ కుటుంబానికి ఆర్థికంగా తనకు తోచిన మేరకు అండగా వుంటూ వచ్చాడు లండన్ నుండి పెళ్ళి పేరుతో ఇండియా కి రప్పించారు.
ప్రేమించిన అమ్మాయి తో పెండ్లి ఆశలు పెట్టుకొని స్వగ్రామానికి వచ్చాడు తీరా ఇక్కడికి వచ్చిన ఆ యువకుడికి అమ్మాయి షాక్ ఇచ్చింది.ఆర్థికంగా మరింత బలమైన సంబంధం ఖరారు చేసుకున్నారు చివరకి వేరే అబ్బాయితో ఈ నెల పెళ్లి చేయడానికి సిద్ధం చేసారు కానీ ఆ పెండ్లికి ఒక్కరోజు ముందే శ్రీకాంత్ ఆత్మహత్య యత్నం చేసాడు సూసైడ్ చేసుకుంటూ సూసైడ్ నోటు కూడా రాసాడు ఇదే విషయం మై అదే రోజున ఎరుగట్ల పోలీస్ స్టేషన్ పిర్యాదు చేశారు పరిస్థితి ఆందోళనకరంగా వుండడం తో శ్రీకాంత్ రెడ్డి ను హుటహుటిన హైదారబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతు 27 న గురువారం తెల్లవారు జామున మరణించాడు.
ఇంత జరిగిన ఏర్గట్ల పోలీసులు తమకేమి సోయే లేదన్నట్లుగా వ్యవహరించారు అందుకే ఉదాసీనత కు తగిన మూల్యం శుక్రవారం చెల్లించుకోక తప్పలేదు బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
హైదారాబాద్ నుంచి వచ్చిన మృతదేహం ను పోలీస్ వాహనం మీదికి ఎక్కించారు. రోడ్డెక్కి వందలాది మంది పోలీస్ ల వైఫల్యాలఫై దుమ్మెత్తి పోశారు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.చివరికి తగిన న్యాయం చేస్తామని సూసైడ్ నోట్ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు
……..@@@@ అధికార పార్టీ నేత నిర్వాహకం వల్లే అప్రతిష్ట @@@@ ……
ప్రజల్లో ఇమేజ్ పెంచుకోవటానికి పోలీస్ శాఖ తరచు అనేక కార్యక్రమాలు చేస్తుంది .ప్రజల కోసమే తామున్నామని ఉన్నతాధికారులు తరుచు చెప్తుంటారు కానీ క్షేత్ర స్థాయిలో అధికార పార్టీ నేతల మెప్పుకోసం పనిచేస్తున్న క్రమం లో అభాస పాలు అవుంతుంటారు ఎరగట్ల యువకుడి ఆత్మ హత్య ఉదంతం లో అధికార పార్టీ నేత ఒత్తిడి తో అచేతనంగా వుండడం వల్లే బాధితులు ఉప్పెనలా వచ్చి పోలీసుల మీద దుమ్మెత్తిపోశారు అసలు జిల్లా పోలీసుశాఖ చరిత్ర లోనే మృతదేహం ను వారి వాహనం మీదికి చేర్చారు ఉన్నత స్థాయి అధికారులు సైతం ఉల్లిక్కి పడేలా చేసారు
