జిల్లాలో తొలిదశ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. తొలి రోజు నుంచే నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామపత్రాలు దాఖలు చేయడానికి ఉత్సాహం చూపడంతో…
తొలి రోజు నుంచే ఎన్నికల వేడి జిల్లాలో పెరిగింది. గ్రామ పంచాయతీ (సర్పంచ్) తొలిదశ ఎన్నికల్లో మొత్తం 184 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఈ మేరకు గురువారం ఉదయం నుంచి నామినేషన్ ను ప్రారంభించారు. దీంతో మొదటి రోజు పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు మొత్తం 140 నామినేషన్లు దాఖలయ్యాయనీ ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా తొలి దశలో ఎన్నికలు జరగనున్న మొత్తం వార్డుల సంఖ్య 1,642 వార్డు సభ్యుల స్థానాలకు గాను మొదటి రోజు 96 నామినేషన్లు దాఖలయ్యాయనీ తెలిపారు. తొలిరోజున సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 236 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
నామినేషన్ల దాఖలుకు ఇంకా సమయం ఉండడంతో, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
