Thursday, April 16, 2026
HomeTelanganaNizamabadజిల్లాలో జోరుగా నామినేషన్ల పర్వం.. రెట్టింపు ఉత్సాహంతో నామపత్రాల దాఖలు..

జిల్లాలో జోరుగా నామినేషన్ల పర్వం.. రెట్టింపు ఉత్సాహంతో నామపత్రాల దాఖలు..

నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల తొలిదశ ఎన్నికల పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. 1నామినేషన్ల దాఖలుకు శుక్రవారం రెండో రోజు కావడంతో, అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహంతో నామపత్రాలు సమర్పించారు.

మొదటి రోజు కంటే రెండో రోజు నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగింది. రెండో రోజు 184 సర్పంచ్ స్థానాలకు మొత్తం 164 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 304 నామినేషన్లు దాఖలయ్యాయి.

వార్డు సభ్యుల స్థానాలు (మొత్తం 1632): వార్డు సభ్యత్వానికి గాను రెండో రోజు 286 నామినేషన్లు నమోదయ్యాయనీ ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు మొత్తం 382 నామినేషన్లు దాఖలయ్యాయనీ అధికారులు పేర్కొన్నారు. పెరిగిన పోటీ.. రద్దీగా మారిన కేంద్రాలు..

రెండో రోజు జిల్లాలోని నామినేషన్ల కేంద్రాల వద్ద అభ్యర్థులు, వారి అనుచరులతో సందడి వాతావరణం నెలకొంది. మంచి ముహూర్తాలు చూసుకుని బంధుమిత్రులతో కలిసి వచ్చి అనేక మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.

ముఖ్యంగా వార్డు సభ్యుల స్థానాలకు రెండో రోజు దాదాపు మూడు రెట్లు అధికంగా నామినేషన్లు రావడంతో, పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఇంకా నామినేషన్ల దాఖలుకు సమయం ఉండటంతో, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య వేలల్లోకి చేరే అవకాశం ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!