నిజామాబాద్ లోకసభ బీజేపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి శుక్రవారం నామినేషన్ దాఖలు చేసారు. ఆయన పసుపు రైతులతో కలిసి వెళ్ళి నామినేషన్ వేశారు. బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, జగిత్యాల కోరుట్ల కు చెందిన పసుపు రైతులతో కలిసి నామినేషన్ వేయడం జరిగింది.
అర్వింద్ నామినేషన్ రుసుముకు అవసరమైన నగదు ను పసుపు రైతులు చందాలు వేసుకుని సమకూర్చారు.
ఇటీవల తన ఇంటివద్దే సుమారు 40 క్వింటాళ్ల పసుపును క్వింటాలుకు రూ.19500 లకు అమ్ముకున్న రైతు శ్రీ వెల్మ రమేష్ గారు అర్వింద్ ధర్మపురి గారి నామినేషన్ ను ప్రపోజ్ చేసారు .