బిఆర్ యస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సన్నిహితుడు నిజామాబాద్ సహకార మార్కెటింగ్ చైర్మన్ గాఉన్న సాంబార్ మోహన్ శుక్రవారం నల్లవెల్లి సింగిల్ విండో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. బాజిరెడ్డి నామినేషన్ వేసే రోజే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.మోహన్ నల్లవెల్లి సింగిల్ విండో చైర్మన్ గా నియామకమైన తర్వాతే నిజాంబాద్ సహకార మార్కెటింగ్ చైర్మన్ పదవి వరించింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నలవెల్లి సింగిల్ విండో చైర్మన్ సాంబార్ మోహన్ పై మెజార్టీ సింగిల్ విండో డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. ఈ మేరకు అధికారులు శుక్రవారం అవిశ్వాస పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా సాంబార్ మోహన్ ముందే తన పదవికి రాజీనామా చేశారు.
దీంతో ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ పదవి సైతం రాజీనామా చేయాల్సి ఉంది సాంబార్ మోహన్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు అత్యంత సన్నిధిలో ఉన్నారు అందుకే సాంబార్ మోహన్ నల్లవెల్లి సింగిల్ ఉండే చైర్మన్ బాధ్యతల నుంచి తప్పించడానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పట్టుదలతో పావులు కదిపారు.