రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ క్రిస్టియన్ ల సంక్షేమం కోసం కట్టుబడి వుందని మాజీ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ రావు అన్నారు. ఆయన ఈ మద్యే బిఆర్ యస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మొదటి సారిగా డీసీసీ కార్యాలయంలో మీడియా తో మాట్లాడారు.
క్రిస్టియన్ ల ఉన్నతి కోసం గతంలో వై యస్ అనుసరించిన విధానాలే రేవంత్ సర్కార్ అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాకు చెందిన షబ్బీర్ అలీ యస్సి బీసీ మైనారిటీ సంక్షేమ లకు సలహాదారుడిగా ఉన్నారని ఆయన ఆధ్వర్యంలో క్రిస్టియన్ సంక్షేమం కోసం పనిచేస్తానన్నారు