HomePOLITICAL NEWSUncategorizedనేను పోరాట యోధున్ని గెలిపిస్తే సమస్య ఫై పోరాడుతా .......బిఆర్ యస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్

నేను పోరాట యోధున్ని గెలిపిస్తే సమస్య ఫై పోరాడుతా …….బిఆర్ యస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్

తాను పోరాట యోధుడినని నక్సలైట్ల తోటే ఎదురోడ్డు పోరాడానని జిల్లా ప్రజల సమస్యలను పార్లమెంట్లో పోరాటం చేయడం తనకి లెక్క కాదని బిఆర్ యస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆయన శుక్ర వారం నామినేషన్ వేసాక కలెక్టరేట్ మైదానం జరిగిన సభ లో మాట్లాడారు ప్రజలు ఎవరికి ఓటేయాలను ఆలోచన చేయాలని కోరారు.

సిట్టింగ్ ఎంపీ అర్వింద్ గత ఎన్నికల్లో పసుపు బోర్డు పేరుతో ఓట్ల దండుకున్నారు. ఆ పని పక్కకు పడేసి మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టడానికి పనిచేశాడన్నారు రాముని పేరుతో ఓట్లు అడుగుతున్న బిజెపి నాయకులకు రాముడుకున్న మంచి గుణాలు ఒక్కటైనా ఉన్నాయా ?దేశంలో ఆర్థిక దొంగలకు వెన్నుదన్నుగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని పదేళ్ల లో దేశంలో పేద ప్రజలకు చెల్లి గవైన ఇచ్చారా అని ప్రశ్నించారు ఎంపీగా ఉన్న అరవింద్ పంచాయతీ బోర్డ్ సభ్యుడుగా కన్న హీనంగా పనిచేస్తున్నాడు

దేశంలో ఏ ఎంపీని నియోజకవర్గ ప్రజలు తరిమికొట్టలేదని కానీ ఎంపీ అరవిందును నిజాంబాద్ జిల్లాలో అనేక గ్రామాల్లో ప్రజలు తరపుకొట్టారని ఆయన గుర్తు చేశారు ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నందుకే అరవింద్ కు అనేక గ్రామాల్లో ప్రజలు తిరగబడి కొట్టారన్నారు

అర్వింద్ ఓడిపోయినంత మాత్రాన మోడీ మళ్ళీ ప్రధాని కాకుండా పోడని అందువల్ల ఈసారి ఎన్నికల్లో అరవింద్ కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు తమ వల్లే పసుపు ధర పెరిగిందని బిజెపి నేతలు చెప్తుంటే నవ్వొస్తుందన్నారు గతంలో ఒక క్వింటాలు పసుపుఅమ్మితే తులం బంగారం వచ్చేదని మరి ఇప్పుడు మూడు క్వింటాళ్ల అమ్మినా తులం బంగారం రావడం లేదన్నారు.

ఐదేళ్లుగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్న జీవన్ రెడ్డి ఏ నాడు నిజాంబాద్ రాలేదని ఆయన గుర్తు చేశారు పార్టీలో చెత్తాచెదారం అంతా పోయి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిందని కేవలం మాణిక్యం బంగారం లాంటి మంచి కార్యకర్తలే ఇప్పుడు పార్టీని పట్టుకొని ఉన్నారని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని అంతే తప్పా జిల్లాలో తాము ఏ తప్పు చేయకపోయినా ఎన్నికల్లో ఓడిపోయామని బాజిరెడ్డి గుర్తు చేశారు. ఈ సభ లో ఎంపీ సురేష్ రెడ్డి ఎమ్మెల్యే లు ప్రశాంత్ రెడ్డి సంజయ్ విద్యాసాగర్ ఎమ్మెల్సీ లు రమణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments