కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన ఘటన నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ విజయబాబు తెలిపిన వివరాల మేరకు.
నగరంలోని సీతారాం నగర్ కాలనీకి చెందిన చల్ల భూలక్మి దంపతులు మంగళవారం అనారోగ్యంతో ఆసుపత్రులలో చూపించుకోవడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఆర్టీసీ డిపో వద్ద వెనుక నుండి అతివేగంతో వచ్చినా కారు ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.
హుటాహుటిన నిజామాబాద్ ఆసుపత్రికి తరలించగా బుదవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ విజయ్ బాబు పేర్కొన్నారు.