నగరంలో ధర్మపురి హిల్స్ మరోసారి గ్యాంగ్ వార్ జరిగింది. గత కొంత కాలంగా స్తబ్దంగా ఉన్న ఈ ప్రాంతంలో శనివారం రెండు గ్యాంగ్ లు కత్తులతో తల బడ్డాయి. ఈ ఘర్షణలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. డైరీ ఫామ్ చెందిన మొహమ్మద్ అద్నాన్ తన నలుగురు ఫ్రెండ్స్ కలిసి ధర్మపురి హిల్స్ కి వెళ్ళాడు అదే ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు సమీర్ రెహాన్ లు తమ స్నేహితులతో ఉన్నారు.
మొహమ్మద్ అద్నాన్ని గ్రూప్ ను అడ్డుకున్నారు. గతంలో మా అన్న సమీర్ ను ఎందుకు కొట్టారంటూ రెహన్ కత్తి తో మూకుమ్మడిగా మొహమ్మద్ అద్నాన్ పై దాడి చేసాడు. దీనితో అద్నాన్ చెయ్యి కట్ అయింది రెండు నరాలు తెగ్గాయి తీవ్రంగా గాయపడడంతో అతన్ని హుటాహుటిన సిటీ హాస్పిటల్ కు తరలించారు. మరో ఇద్దరికీ కూడా స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం