దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఆంధ్రప్రదేశ్ లో బిన్నమైన ఫలితాలే వచ్చేలా ఉన్నాయి.వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం వుందని ఎగ్జిట్ పోల్ అంచనాల్లో స్పష్టం అయింది. కానీ ఎంపీ స్థానాల్లో మాత్రం కూటమి మెజార్టీ స్థానాలు సాధించే అవకాశం వుందని తేల్చేశాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 94 నుంచి 104 సీట్లతో మళ్లీ జగన్ అధికారంలోకి వస్తున్నట్లు చెప్పారు అరా మస్తాన్.సంస్థ స్పష్టం చేసింది టీడీపీ కూటమి 71 నుంచి 81 మధ్య సీట్లను గెలుస్తుందని వెల్లడించారు .
టీడీపీ కూటమి కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనంగా 25 సీట్లు రాబోతున్నాయని సర్వేలో వెల్లడైనట్లు వివరించారు.ఇక పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 15 లోక్ సభ సీట్లలో గెలుస్తుందని చెప్పిన ఆరా మస్తాన్.. టీడీపీ కూటమి 10 నుంచి 12 సీట్లలో గెలవబోతుందని వివరించారాయన.
జనసేన పార్టీ పోటీ చేసిన రెండు పార్లమెంట్ సీట్లలో ఆ పార్టీనే విజయం సాధిస్తుందని వివరించారు.
వైఎస్ షర్మిల ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ ఓట్లను భారీ చీల్చిందని.. దీని వల్ల మూడు పార్లమెంట్ సీట్లను వైసీపీ కోల్పోవాల్సి వస్తుందని.. ఇది ఆ పార్టీకి నష్టం చేకూర్చిందన్నారు ఆరా సర్వే మస్తాన్.