నిజామాబాద్ నగరంలో గంజాయి సరఫరా చేస్తున్న బీహార్‌కు చెందిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు.అతని వద్ద నుంచి సుమారు కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటన రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.నిందితుడు ఖానాపూర్ నగర శివారులోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నట్లు తెలిసింది. సీసీఎస్ పోలీసులు నిందితుడిని రూరల్ పోలీసులకు అప్పగించగా.. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంజాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు? ఎవరి నుంచి సరఫరా అవుతోంది? నగరంలో ఎవరెవరికి విక్రయిస్తున్నాడు? అనే వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నిందితుడి వెనుక మరెవరైనా ఉన్నారా? అన్న కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో గంజాయి సరఫరా ముఠా వివరాలు బయటపడే అవకాశం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
