Sunday, April 19, 2026
HomeTelanganaNizamabadసమాజ సేవలో ముందుండాలి .. ధన్ పాల్ లక్ష్మీ బాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు...

సమాజ సేవలో ముందుండాలి .. ధన్ పాల్ లక్ష్మీ బాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో అంబలి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే…

సమాజ సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ధన్ పాల్ లక్ష్మీ బాయి, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పీఎల్ఎంఎస్ పెట్రోల్ బంక్ ఎదురుగా అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నగరవాసుల సౌకర్యార్థం అంబలి పంపిణీ చేస్తున్నామన్నారు. ఎండ దెబ్బ, వేడి నుంచి అంబలి ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు.

కేంద్రాన్ని గత 12 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారని, నాలుగేళ్లుగా తమ ట్రస్ట్ సహకరిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా గ్రామీణులు అధిక సంఖ్యలో వస్తారని, వారికి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశ్యంతో అంబలి పంపిణీ చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో అంబలి కేంద్ర ప్రతినిధి పార్శి రమేష్, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీ నారాయణ, బట్టు రాఘవేందర్, జ్యోతి మురళి, బంటు ప్రీతి ప్రవీణ్, మల్కాయి మహేందర్, మఠం పవన్, మల్లేష్ యాదవ్, కల్పె అర్చన చిరంజీవి, ఎర్రం ప్రభాకర్, గజవాడ ఆగమయ్య, మంచొల్ల రామస్వామి, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!