తెలంగాణలో అధికారంలోకి రావాల్సిన బీజేపీ కేవలం ఎనిమిది స్థానాలకే ఎందుకు పరిమతమైందో బీజేపీ నాయకత్వం ఆలోచించాలని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు గ్రేటర్.
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయడం లేదన్నారు. ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ ఎందుకు అధికారంలోకి రావడం లేదో ఆలోచించే పనిలో పార్టీ ఉండాలని సూచించారు. .
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 డివిజన్లు గెలుచుకున్న బీజేపీ ఒక్క ఎమ్మెల్యే సీటును ఎందుకు గెలుచుకోలేకపోయిందనేదానిపై పార్టీయే ఆలోచించుకోవాల్సి ఉందన్నారు దీనికి బాద్యులెవరో గుర్తించాలన్నారు.
దేశంలోనే అత్యధికంగా ఆర్వోబీలు నిజామాబాద్ పార్లమెంట్ కు మంజూరయ్యాయని ధర్మపురి అరవింద్ తెలిపారు.మంగళవారం కలెక్టరేట్ లో ఆర్వోబీ పనుల సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైల్వే అండర్ బ్రిడ్జి పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయని ఆయన మండిపడ్డారు.
ప్రధానంగా మాధవ నగర్ బ్రిడ్జికి మొత్తం రూ.103 కోట్ల రూపాయలు అవరసమని ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించలేదన్నారు.
అందులో రూ. 93 కోట్ల నిధులు విడుదలయ్యాయని అలాగే ఆరు నెలల క్రితం రూ. 10 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఇప్పటివరకు స్పందించలేదన్నారు. కనీసం పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
అయినా కాంట్రాక్టర్లకు తన స్వంత డబ్బులతో పనులు చేస్తున్నారని అందుకు కాంట్రాక్టర్ ను అభినందించారు.అలాగే అర్సపల్లి బ్రిడ్జికి రూ.135 కోట్లలో 90 శాతం రైల్వే నిధులు మంజూరయ్యాయని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 4.5 కోట్ల నిధులు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు.
అలాగే మూడున్నర ఎకరాల స్థలం కావాలని ఇప్పటికీ కేటాయించలేదనీ దుయ్యబట్టారు.
పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కనీసం కౌన్సిలర్ గా కూడా ఎన్నికల్లో గెలవలేదని ఎద్దేవ చేశారు. మహేశ్ కుమార్ గౌడ్ అవగాహన లేకుండా ఆర్వోబీలు గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ముందు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులపై శ్రద్ధ చూపాలని సూచించారు.
అలాగే రాష్ట్రంలో 28 ఇంటిగ్రేటెడ్ స్కూల్ లు మంజూరయ్యాయి.అందులో కనీసం జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వలేదని మండిపడ్డారు.నిధులన్నీ నల్గొండ ఇతర జిల్లాలకు మళ్లిస్తున్నారని, జిల్లా మీద ప్రేమ ఉంటే అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
అదే విధంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని ఆర్వోబి,ఆర్యుబీ పనులు కేంద్ర ప్రభుత్వం ఆద్వర్యంలో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ పాలనలో వేలకోట్ల నిధులు మళ్ళించారని ప్రభుత్యం చొరవతో ఆ నిధుల్లని తిరిగి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వనికి సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్యం వ్యవస్థను భ్రష్టు పట్టించిందనీ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలపట్ల పక్షపాతం చూపిస్తే కాంగ్రెస్ కూడా కనుమరుగవుతోందని విమర్శించారు.
అలాగే బిజెపి ఎంపీ చొరవతో మాత్రమే జిల్లాలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలు, పసుపు బోర్డు ప్రారంభమయ్యాయని తెలిపారు.
