సమయానికి స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో ఫీట్స్ వచ్చిన రోగిని ఆమె బందువు భుజాల మీద తీసుకెళ్లిన ఉదంతం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. రెంజల్ మండలం కు చెందిన లక్ష్మి అనే మహిళా పిట్స్ వస్తుంటే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి నిన్న మధ్యాహ్నం 1:30 వచ్చారు.
డాక్టర్ కి చూపి సిటీ స్కానింగ్ చేసుకొని రా అన్నారు రోగి తాలూకు వారు ప్రభుత్వ హాస్పిటల్ లో స్కానింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ వాళ్ళు మిషన్ పని చేయడం లేదని 2 గంటలకు పైగ కూర్చోబెట్టారు.ఆ తరువాత బయట ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి స్కాన్ చేయించువాలని చెప్పారు.
డబ్బులు పెట్టె స్తోమత లేని రోగి తాలూకు వారు హాస్పిటల్ లో 4 గంటలవరకు అక్కడే ఉండగా, డాక్టర్ & సిబ్బంది రోగిని బయకు తీసుకెళ్లండి అంటూ కసుకున్నారు .కానీ ఏదైన వైద్య సహాయం అందుతుందనే ఆశ తో అక్కడే ఉండి పోయారు.
సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు రోగి తనతో ఆమె ఇద్దరు చిన్న పిల్లలు బిక్కు, బిక్కుమంటు చలి కాలం, దోమల్లో అక్కడే పడి ఉన్నారు ఆ సమయంలో కూడా రోగికి పిట్స్ వస్తూనే ఉన్నాయి….
హాస్పిటల్ లోకి మళ్ళీ తీసుకెళ్దాం అన్న ఆమె నడవలేని పరిస్థితి, స్టేచర్ లేదు, హాస్పిటల్ బాయ్స్ లేరు 11 గంటల తరువాత రోగి తాలూకు బంధువులు కొంత మంది ఆమెను భుజాలపై వేసుకొని హాస్పిటల్ లోకి వచ్చి హాస్పిటల్ లో దర్నకు దిగి సూపరింటెండెంట్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీస్ వారు, హాస్పిటల్ సిబ్బంది వచ్చి నచ్చజెప్పి ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది.
