జగిత్యాల జిల్లా కొండగట్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఘన స్వాగతం పలికారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో సుమారు రూ.35.19 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వాయుపుత్ర సదన్ 100 గదుల ధర్మశాల నిర్మాణానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం శంకుస్థాపన చేశారుఈ ధర్మశాల నిర్మాణం ద్వారా భక్తులకు మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని పలువురు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీటీడీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ను చుడడానికి ఆయన అభిమానులు భారీ సంఖ్య లో తరలి వచ్చారు
