మోస్రా రామాలయం దేవస్థానాన్ని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం దర్శించుకున్నారు.
వేదోచ్చారణల నడుమ ఆలయ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలకు శాంతి, సుఖసంపదలు, అభ్యుదయం కలగాలని ప్రార్థించారు.
