నగరంలోని బాబాన్ సా పహాడ్ ప్రాంతంలో ఎన్ఫోర్స్మెంట్ బృందం నిర్వహించిన మెరుపు దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ సీఐ బాలకిషన్ తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం… బాబాన్ సా పహాడ్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ బృందం రంగంలోకి దిగి నిఘా పెట్టింది. ఈ క్రమంలో బజాజ్ పల్సర్ వాహనంపై గంజాయిని తరలిస్తుండగా, సౌద్ చౌస్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అతని వద్ద నుండి 152 గ్రాముల ఎండిన గంజాయితో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
ఈ దాడుల్లో ఎస్ఐ రాంకుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, భూమన్నలతో పాటు కానిస్టేబుళ్లు విశ్వనాధ్, సాయి, లక్ష్మి నర్సింహా, మౌనిక, శివ, సంకీర్త్, విట్టల్, అర్పిత, మౌనిక, శ్యామ్ పాల్గొన్నారు.
