HomeEditorial Specialనిజాంబాద్‌లో పెట్రోల్ కష్టాలు: బంకుల వద్ద భారీగా క్యూలు!

నిజాంబాద్‌లో పెట్రోల్ కష్టాలు: బంకుల వద్ద భారీగా క్యూలు!

నిజాంబాద్ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత సామాన్యులను బెంబేలెత్తిస్తోంది. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు.

కేవలం టూవీలర్లు, ఫోర్ వీలర్లే కాకుండా.. సరుకు రవాణా చేసే భారీ వాహనాలు (Goods Carriers) కూడా ఇంధనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.ట్యాంక్ ఫుల్ చేసుకుంటుండటంతోనే కొరత?స్థానిక పెట్రోల్ బంకుల్లో పరిస్థితిని గమనించగా, స్టాక్ త్వరగా అయిపోవడానికి ప్రధాన కారణం “పానిక్ బయ్యింగ్” (ఆందోళనతో కొనుగోలు చేయడం) అని తెలుస్తోంది.

బంక్ సిబ్బందిని వివరణ కోరగా.. “సాధారణంగా లీటర్, రెండు లీటర్లు పోయించుకునే వాహనదారులు కూడా కొరత ఏర్పడుతుందనే భయంతో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. దీనివల్ల స్టాక్ వచ్చిన కొద్దిసేపటికే బోర్డులు పెట్టాల్సి వస్తోంది” అని వారు సమాధానమిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments