మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి వారం రోజులు శిక్ష, 16 మందికి భారీ జరిమానా విధించినట్లు పోలీసుకు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన 19 మందిని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పి. ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించి, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందు హాజరుపరిచారు.
కేసును విచారించిన న్యాయమూర్తి, నిబంధనలు ఉల్లంఘించిన 16 మందికి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 1,60,000 జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే తీవ్రతను బట్టి ముగ్గురు వ్యక్తులకు వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.
నాగులవారి పండరి, కోటగిరి నరసింహ, తీలా విజయ్ కుమార్ జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ..
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
