నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం అధికార పార్టీలో ఏనుగు పోచారం వర్గాల మధ్య వర్గ పోరు మరోసారి రచ్చకెక్కింది. ఇరుపక్షాల కార్యకర్తలు తన్నుకున్నారు చివరికి ఠాణా కెక్కారు.
వర్ని మండలం బుధవారం రాత్రి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన వడ్డేపల్లి గ్రామస్థుడు భీమశంకర్ పై దాడి రాత్రి 8:30 కు ఇంట్లోకి దూసుకెళ్లి భీమశంకర్ అతని 8 ఏళ్ల కొడుకు మీద పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు మూకుమ్మడిగా వెళ్లి దాడి కి దిగారు.
మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్ ఆయన కొడుకు కొడుకులు ఇందులో ఉన్నారు. తనపై దాడి జరిగిన విషయం పిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల మీద పొలిస్టేషన్ లో నే దాడి చేశారు.
ఇరుపక్షాలు అధికార పార్టీకి చెందిన కీలక నేతలే కావడంతో ఎవరిమీద కేసులు నమోదు చేయని దిక్కు తోచని స్థితి లో పోలీసులు ఉన్నారు.
