పేకాట రాయుళ్లు అరెస్టు…నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్లితే నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో పేకాట గురువారం రాత్రి తొమ్మిది మంది పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
వారినుంచి రూ. 1,15,790, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
