అనేక అక్రమ దందాలు కళ్ళముందే యదేచ్చగా సాగుతుంటే నిస్సహాయులుగా బేలా చూపులు చేసే పోలీసు శాఖ ప్రభుత్వ ఎంతో గర్వంగా చెప్పే పర్యాటక రంగం మీద కత్తి ఎత్తింది. పర్యాటక ప్రాంతాలకు అనుమతి ఇచ్చే విషయంలో నిర్వాహకులను ముప్పు తిప్పలు పెడుతుంది.
ఆంక్షలు పేరుతో సర్కస్ ఫీట్లు వేస్తున్నారు.ఎక్కడా లేని కొర్రీలు వేస్తూ నిర్వాహుకులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఇక్కడే తిష్ట వేసిన కొందరు కమిషనరేట్ అధికారులు నిర్వాహకం తో కోట్ల రూపాయల వ్యయం తో అందుబాటులోకి వచ్చిన ఓ వాటర్ పార్క్ నాలుగు నెలలుగా మూత పడింది.
రెండు రాష్ట్రలు ఎనిమిది జిల్లాల నుంచి వచ్చే పర్యాటకుల తో కళకళ లాడిన ఆ పార్క్ ఇప్పుడు పోలీస్ శాఖ ఆంక్షలఉసురు తగిలి మూలన పడి ములుగు తుంది. నిజామాబాద్ నగరానికి ఏడు కిలో మీటర్ల దూరం లోని మదనపల్లి గ్రామ శివారు లో సుమారు 15 ఎకరాల విస్తీర్ణం లో సుభాష్ ఆగ్రో వాటర్ పార్క్ అందుబాటులోకి వచ్చింది గతంలో 20 ఏళ్ల పాటు స్విమింగ్ ఫుల్ జిమ్ నిర్వహణలో ఉన్న శ్రీనివాస్ రెడ్డి కోట్లాది రూపాయలు వెచ్చించి వాటర్ పార్క్ ఏర్పాటు చేశారు గతంలో పనిచేసిన కలెక్టర్ కమిషనర్ లు కుటుంబ సభ్యులతో వెళ్లి శిఖర్ కూడా చేసొచ్చారు.
దాదాపు మూడేళ్ళ తర్వాత తాగిన మైకం లో నలుగురు యువకులు వీరంగం చేసిన ఘటనలో అక్కడి సిబ్బంది మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు ఈ ఘటన ను తీవ్రంగా పరిగణించిన కమిషనర్ కల్మేశ్వర్ కఠిన చర్యలకు పురమాయించారు ఓనర్ తోపాటు నిందితుల మీద కేసు లు పెట్టి జైలు కు పంపారు. ఇంతవరకు బాగానే ఉంది.
కానీ తాగుబోతుల వీరంగం తో జరిగిన ఘటన ను పరిగణలోకి తీసుకోని పార్క్ కు అధికార అనుమతులేవి లేవంటూ సీజ్ వేశారు. సరే అనుమతులు తీసుకోవాలని గతంలో ఆ అధికారి తమకు చెప్పలేదని నిర్వహకులు బుకాయించినా అంత భారీ ప్రాజెక్ట్ కు కనీస అనుమతులు లేకుండా సందర్శుకులను అనుమతించడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే.
సీజ్ ను సవాల్ చేస్తూ హైకోర్టు ను ఆశ్రయించారు. సరే ఎలాగో సీజ్ చేసారు కదా ? కనీసం ఇప్పుడైన అనుమతి ఇవ్వాలని కమిషనర్ ను దరఖాస్తు చేసుకున్నారు. అందుకు అవసరమైన అనుమతులు ఆయా ప్రభుత్వ శాఖల నుంచి సదురు యజమాని కమిషనరేట్ లో దాఖలు చేశారు. కానీ ఏవో మరికొన్ని అనుమతులు ఇవ్వాలని కొర్రీ వేశారు.
వారు చెప్పిన మేరకు మరికొన్ని పత్రాలు జత చేసి మరోసారి అనుమతి కోసం దరఖాస్తు చేసారు. ఎస్సై సీఐ ఏసీపీ స్థాయిలో అందరూ యన్ వో సి ఇచ్చేసారు.కానీ కమిషనర్ బదిలీ కావడంతో సదురు నిర్వాహుకుడు ఇంచార్జి గా ఉన్న కామారెడ్డి ఎస్పీ ని కలిసి తన ఆవేదన వ్యక్తం చేశారు.
మరో వైపు స్థానిక ఏసీపీ ని సైతం అనుమతుల కోసం ప్రాధేయపడ్డారు మరో వైపు అధికార పార్టీ కి చెందిన ఒకరిద్దరు నేతల ను ఆశ్రయించారు. మొదట సానుకూలంగా స్పందించిన ఇంచార్జ్ కమిషనర్ కమిషనరేట్ అధికారుల బ్రీఫింగ్ తర్వాత జేఎన్టీయు నుంచి మరో అనుమతి కావాలని మెలిక పెట్టారు.
ఆ గ్రౌండ్ లోనే మరోసారి అనుమతి దరఖాస్తు ను పక్కకు పెట్టేసారు. ఇంత కాలం అనుమతి కోసం కమిషనరేట్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన యజమాని చేసేది లేక ధిక్కార స్వరం అందుకున్నారు.
పర్యాటక ప్రాంతాల్లో అనుమతుల విషంయంలో అధికారుల నాన్చుడు ధోరణి ఫై నగరంలో ఫ్లెక్సీ లు వేసాడు నేరుగా పోలీసు శాఖ ను టార్గెట్ చేయక పోయినప్పటికీ ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ‘జిల్లాలో పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అని, కొంతమంది అధికారుల కబంధ హస్తాల్లో చేతుల్లో చిక్కిన పర్యాటకరంగం..
త్వరలో అన్ని అధారాలతో మీ ముందుకు’ వస్తా అంటూ చిన్న హెచ్చరిక వదిలాడు .
