కామారెడ్డి జిల్లాలో కి బీజేపీ నేతలు ఎంట్రీ కాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లెవ్వరు జిల్లాలో అడుగుపెట్టకుండా పోలీసులు ఎక్కడిక్కడే చెక్ పోస్టు లను అందుబాటులోకి తెచ్చారు.
వారొస్తే స్థానికంగా పరిస్థితులు మరింత జటిలం అయ్యే ప్రమాదం వుందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు బీజేపీ కి చెందిన ముఖ్య నేతలు ఎక్కడెక్కడి ఉంది వారి కదలికల సమాచారం తెల్సుకొని వారిని ఎక్కడిక్కడే ముందస్తు గా అదుపులోకి తీసుకునే కార్యాచరణ అమల్లోకి తెచ్చారు బాన్సువాడ పట్టణం లో గత రాత్రి ఇరువర్గాలమధ్య ఘర్షణ లు చెలరేగాయి పోలీసులు వెంటనే రంగంలోకి పరిస్థితి అదుపులోకి తెచ్చారు కానీ శనివారం బాన్స్ వాడ బంద్ కు బీజేపీ పిలుపు నిచ్చింది.
బంద్ లో పాల్గొనడానికి మాజీ ఎమ్మెల్యే బీజేపీ అగ్ర నేత ఎండల లక్ష్మీనారాయణ హైదరాబాద్ నుంచి బాన్స్ వాడ కు వెళ్తుండగా జిల్లా సరిహద్దులో నే యెండల ను అదుపులోకి తీసుకున్నారు సమీపం లోని బిక్కనూర్ పోలీస్ స్టేషన్ లో నిర్భందించారు బాన్సువాడ పట్టణంలో గాయపడిన కార్యకర్తలను దాడికి గురైన హిందూ యువతిని పరామర్శించేందుకు వెళ్తున్నాని అందుకు అనుమతి ఇవ్వాలని యెండల కోరినా వారు అనుమతిఇవ్వలేదు .
ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచకాలు పెట్రేగిపోయాయని,, పోలీసులు కూడా బాధితుల పక్షాన నిలువకుండా రాజకీయ ఒత్తిడికి తలొగ్గి బాధితులపైనే అక్రమంగా వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
దాడికి పాల్పడటమే కాకుండా అత్యాచారానికి ప్రయత్నించిన దుండగుడిఫై హత్యాయత్నం కేసును నమోదు చేయాలని, నిందితుడిని అత్యంత కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో బాన్సువాడ నియోజకవర్గ మొత్తం ఎక్కడికక్కడ నిరసనలు పెళ్ళుబుకుతాయని ఆయన పోలీసులను హెచ్చరించారు.
@@@ మేడ్చల్ వద్ద రాకేష్ రెడ్డి అదుపు లోకి @@@
ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ని మేడ్చల్ లో అదుపులోకి తీసుకున్నారు ఆయన శనివారం హైదారాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా పోలీసులు ఆయన వాహనం ఆపేసారు తాను ఆర్మూర్ వెళ్తున్నాని చెప్తున్నా సరే పోలీసులువినలేదు ఆయన కామారెడ్డి వెళ్తున్నారనే సమాచారం మేరకే అదుపులోకి తీసుకున్నారని సమాచారం కామారెడ్డి బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన ఘర్షణలు జరుగుతున్నాయి.
బీజేపీ కి చెందిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను కాంగ్రెస్ నేతలు ముట్టడించాడనికి రావడంతో బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడికి తెగబడ్డారు. దీనితో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది పోలీసులు వందలాదిగా మోహరించారు
