కింది స్థాయిలో పార్టీ జెండా మోసి బలోపేతానికి పనిచేశారో వారిని గుర్తించి వారికి పదవులు ఇస్తామని మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు
పీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పట్టణ అధ్యక్షులు కేశవేణు అధ్యక్షతన బస్వా గార్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు.
పట్టణ ఇన్చార్జ్ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరి .లు పాల్గొన్నారు ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచింది
ప్రజలు మనల్ని నాయకులుగా ఉన్నందుకు ప్రజల సమస్యలు తీర్చడానికే ఎక్కువ సమయం ఇవ్వాలని, అప్పుడే ప్రజా నాయకులం అవుతాం తప్ప పదవుల కోసం పాకులాడితే కుదరదని అన్నారు.
ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో 83 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం కొత్తగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నాం ఆస్పత్రి డ్రైన్ మొత్తం కొత్తగా మారుస్తున్నాంఈరోజు బిఆర్ఎస్ బీజేపీ చేసిందేమీ లేదు.
ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలిచిన్న చిన్న గొడవలు పక్కన పెట్టీ రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలిప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలియంత్రాంగం లో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలిచిన్న చిన్న గొడవలకు వివాదాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తాము
కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తాంఇన్ని రోజులు కార్యకర్తలు మన గెలుపు కోసం కష్టపడ్డారు ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైంది వారికోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులు గా తీర్చిదిద్దుతాంఅందరూ పార్టీ సమావేశాలు తప్పకుండా రావాలి
ఏఐసీసీ ఆదేశాలు మేరకు డివిజన్ పట్టణ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలికార్యకర్తలకు బాధ్యతలు,పదవులు ఇవ్వడమే మా లక్ష్యం,భూ భారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నాము.Kcr డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కమిషన్లు తిన్నారు.కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తుంది.
ఒక్కొక నియోజకవర్గానికి 10000 ఇల్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారుమన వాళ్ళు వేరే వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తాం.
ఇల్లు నిర్మాణ పనులను బట్టి నిధులు మంజూరు అవుతాయిజై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమము ప్రతి డివిజన్ కు తీసుకు వెళ్తున్నారు ఈ కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలిపార్టీ లేకుంటే కండువా లేకుంటే మనకు అవకాశం ఇచేది ఎవరు.
రాబోయే ఎన్నికల్లో పార్టీ బలంగా నిలబడాలంటే ముందుగా మన ప్రభుత్వం అధికారంలో ఉండాలి.కావున మనలో మనం కలిసి ఉండాలిపాత కొత్త అనే తేడా ఉండకూడదు. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది.
ఎవరైతే కింది స్థాయిలో పార్టీ జెండా మోసి బలోపేతానికి పనిచేశారో వారిని గుర్తించి వారికి పదవులు ఇస్తాంక్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయి
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు పార్టీ డివిజన్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
