నగరంలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం..పొట్టి శ్రీరాములు విద్యాలయం పేరుమార్పు వైశ్య జాతికే అవమానమని ఇందూర్ ఆర్యవైశ్యులు నిరసన వ్యక్తం చేశారు.ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ సిఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.
వారు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు పేరుమార్పుపై ప్రభుత్వం పునారాలోచన చేయాలని ఆర్యవైశ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే ఆర్య వైశ్యులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
