ప్రజా పాలన లో భాగంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో 20,6వార్డులో ప్రజాపాలన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తెల్ల రేషన్ కార్డు,ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను వివరించారు రైతు భరోసా కు సంబంధించి భూమి ఉన్నవారికి రెండు విడుదలుగా సంవత్సరానికి 12 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని భూమిలేని రైతు కూలీలకు ఉపాధి హామీ పథకంలో అర్హులై ఉండాలి ఉపాధి హామీ పథకంలో అర్హులై ఉన్న ప్రతి రైతుకూలికి సంవత్సరానికి రెండు విడుదలగా 12000 ప్రభుత్వం చెల్లిస్తుందని కమిషనర్ తెలిపారు తెల్ల రేషన్ కార్డు కు సంబంధించి పేద వర్గాలకు సంబంధించిన
ఈ రేషన్ కార్డు కు రెండున్నర ఎకరాల లోపు రైతువై ఉండాలి కారు ఉండకూడదు జి ప్లస్ వన్ జి ప్లస్ టు బిల్డింగ్ ఉండకూడదు అయితే రేషన్ కార్డులకు అర్హులు అవుతారుఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో 3500 ఇండ్లు నిజామాబాద్ అర్బన్ నగరానికి కేటాయిస్తున్నామని తెలిపారు
అయితే దీనికి సంబంధించి అర్హులకు కేవలం ఖాళీ జాగా ఉంటేనే అర్హులు వీరికి సొంత ఇల్లు వేరే ఉండకూడదు రేషన్ కార్డుకు సంబంధించి రేషన్ కార్డులో ఒక్కరి పేరు మీదనే ఇందిరమ్మ ఇల్లు పథకం వర్తిస్తుంది అని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎస్ దిలీప్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమారాణి , న్యాలం రాజు తదితరులు పాల్గొన్నారు
