నిజామాబాద్ లో దొంగలు సోమవారం అర్ధ రాత్రి స్వైర విహారం చేసారు. నిజామాబాద్ నగరంలోనే రెండు ప్రాంతాల్లో మూడు దుకాణాల్లో బోధన్ లో ఓ షాప్ లో దొంగతనం జరిగింది. షెటర్ లను రాడ్డు తో పైకి లేపేసి షాప్ లోకి చొరబడుతున్నారు.
వరుస దొంగతనాలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. క్లూస్ టీమ్ లు రంగంలోకి దిగాయి ఆధారాలు సేకరించే పనిలో పడ్డాయి. నగరంలోని .పూసలు గల్లీలోని జవహర్ రోడ్ లో గల జెడి గార్మెంట్స్ లో అర్ధరాత్రి దుండగులు స్వెటర్లు గడ్డపారలతో ధ్వంసం చేసి లోపలికి చొరబడ్డారు.
బట్టలు దొంగతనం జరిగాయని అంటున్నారు డబ్బులు ఎన్ని పోయాయి అనేది ఇంకా తెలియ రాలేదు ఈ షాపు యజమాని ఇంకా పిర్యాదు చేయలేదు .స్థానికులు ఒకటో టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నగరంలోని చంద్ర శేఖర్ నగర్ లో రెండు షాప్ ల్లో దొంగతనాలు జరిగాయి.
హనుమాన్ ఆలయం వద్ద ఉన్న మెడికల్ ,కిరాణా దుకాణాల షెటర్ లను రాడ్ తో లేపేసి దొంగతనాలు చేశారు.అలాగే బోధన్ పట్టణంలో చెప్పుల దుకాణంలోనూ దొంగతనం జరిగింది. ఇందులో ముప్పై వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు.

నగరంలో ఆయా షాప్ ల్లో ఏ మేరకు సొత్తు పోయిందని ఇంకా వెల్లడి కాలేదు. బాధితుల పిర్యాదు మేరకు కేసు లు నమోదు చెయ్యనున్నారు.
నగరంలో ఒక్కరోజే మూడు షాప్ ల్లో దొంగతనాలు జరగడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు.గత పది రోజులుగా నగరంలోఇలాంటి చోరీ లే జరుగుతున్నడడంతో పోలీసులు సీరియస్ గా రంగంలోకి దిగారు.
కేవలం దుకాణాలను టార్గెట్ చేస్తున్నారు కేవలం ఇనుప రాడ్ తో తాళం వేసి ఉన్న షటర్ ను అమాంతం పైకి ఎత్తేసి లోపలికి చొరబడుతున్నారు. ఈ తరహా చోరీలు చేసే ముఠాలు దాదాపు అనేకము ఉన్నాయి. అందుకే ఎవరు ఈ చోరీ లకు పాల్పడ్డారనేది అరా తీస్తున్నారు.
