HomeTelanganaNizamabadప్రశాంత్ రెడ్డి వి బోగస్ మాటలు ….కాళేశ్వరం ద్వారా ఉమ్మడి జిల్లా చుక్క నీరు రాలేదు……కవిత...

ప్రశాంత్ రెడ్డి వి బోగస్ మాటలు ….కాళేశ్వరం ద్వారా ఉమ్మడి జిల్లా చుక్క నీరు రాలేదు……కవిత వల్లే గెలిచాడు ……జాగృతి నేతలు


కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదనీ తెలంగాణ జాగృతి రాష్ట్ర రైతు విభాగ అధ్యక్షుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2021 ఏప్రిల్ 22న కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ కు గోదావరి నీళ్లు చేరాయి..

కేవలం ఆ సంవత్సరం యాసంగి సీజన్ పంటలను కాపాడేందుకు మాత్రమే ఆ నీటిని ఉపయోగించారు. ఆ తర్వాత ఎప్పుడూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాం సాగర్ కు నీటిని తరలించాల్సిన అవసరం రాలేదు.2023 జూలైలో ఎస్ఆర్ఎస్ పీ పునరుజ్జీవం ప్రాజెక్టు ద్వారా 2.50 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పీలోకి ఎత్తిపోశారు.. ఆ తర్వాత ఎగువ నుంచి వరద రావడంతో ఎత్తిపోసిన నీళ్లతో పాటు వరద నీళ్లు స్పెల్ వే గేట్ల ద్వారా గోదావరిలోకి.. ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను దాటుకొని బంగాళాఖాతంలోకి చేరింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

శ్రీరాంసాగర్ ను కాళేశ్వరం నీళ్లతో నింపామన్న ప్రశాంత్ రెడ్డి మాటలు ఎలా నిజమవుతాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లాలో 1,81,349 ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 1,86,262 ఎకరాలు ప్రతిపాదించారు..

ప్యాకేజీ 20, 21, 21ఏ, ప్యాకేజీ 22 కింద వీటిలో ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్లు రాలేదు ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్ పీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఇరిగేషన్ చరిత్రలోనే అత్యంత అవినీతి
రూ.1,067 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు నాలుగేళ్లలోనే రూ.2 వేల కోట్లకు చేరింది
తెలంగాణ జాగృతి నాయకుల అవంతి మాట్లాడుతూ.. ప్రశాంత్ రెడ్డి నువ్వు రెండుసార్లు ఎలక్షన్లు గెలవడానికి కవిత కారణం కాదా నువ్వే చెప్పాలన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో ఒక ఎకరం కూడా నీళ్లు ఇవ్వలేదు నిజామాబాద్ జిల్లాకు పది సంవత్సరాలు మంత్రిగా ఉండి నువ్వేం చేసావో చెప్పాలనీ అన్నారు.

ఈ కార్యక్రమంలో సుదం రవిచందర్, శ్రీనివాస్ గౌడ్, విజయలక్ష్మి,శేఖర్ రాజు, గరురాజు, మీసాల శంకర్, ఎండల ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్,దొంత ప్రవీణ్ కుమార్, సాయి కృష్ణ ,శోభ,రేఖ,అనిల్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments