గుట్టలా పేరుకు పోయిన ఆస్థి పన్ను వసూళ్ల కోసం ఎట్టకేలకు మున్సిపల్ యంత్రాంగం నడుం కట్టింది. స్పెషల్ డ్రైవ్ లకు శ్రీకారం చుట్టారు.ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నలబై రోజుల గడువే ఉండడంతో ఖజానా ను కాసులతో నింపడానికి సమాయత్తం అవుతున్నారు.
కఠిన కార్యచరణ కోసం సిద్ధం అవుతుంది. కొత్తగా వచ్చిన కమిషనర్ ఈసారి బకాయి ల వసూళ్ల విషయంలో కఠినంగా ఉండేలా ప్రణాళిక ఖరారు చేసారు.ఎలాగో పాలక మండలి పాలన గడవు పూర్తీ అయింది.
అంటే పన్ను వసూళ్ల విషయంలో అంతగా ఒత్తిళ్లు ఉండవని ఆలోచనతో వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసారు. అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న వారిని ఇందుకోసం రంగంలోకి దించారు సుమారు వంద మంది వసూళ్ల కార్యం పనిచేయబోతున్నారు.ప్రతియేటా ఆస్థి కుళాయి పన్నులను మార్చి నెలఖారు లోగ వసూలు చేస్తారు.
ఆతర్వాత కూడా ఆస్థి పన్ను చెల్లించని వారికి ఫెనాల్టీ విధిస్తారు. ఆస్థి వసూళ్ల ఆధారంగానే మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ను రూపొందిస్తారు.ప్రతియేటా కనీసం 80 శాతం మేరకైనా ఆస్థి పన్ను వసూళ్లు కావాలి కానీ ఈసారి ఆ లక్ష్యసాధన లో రెవెన్యూ యంత్రాంగం వెనుక బడింది.ఆ విభాగంలోకీలక స్థానాల్లో అధికారుల లేరు.
అందుకే కింది స్థాయిలో బిల్ కలెక్టర్ లు మొక్కుబడిగా పనిచేస్తున్నారు.ఆర్థిక సంవత్సరం కు ఇంకా నలభై రోజులే గడువుంది.అందుకే నిర్దేశిత గడువులోగా వసూళ్ల రాబట్టాలనేది కమిషనర్ ఆలోచనగా ఉంది.పన్ను వసూలు బృందాలకు నోడల్ ఆఫీసర్, జోనల్ టీమ్ ఆఫీసర్లు, వార్డు ఆఫీసర్లు, సపోర్టింగ్ స్టాఫ్ & శానిటరీ జవాన్లను సైతం ఈసారి వసూళ్ల కోసం రంగంలోకి దించారు .
ఎలా వసూలు చేయాలి, రోజువారీ పన్ను వసూళ్లను ఎలా పెంచాలనేది కమిషనర్ దిశానిర్దేశం చేశారు స్వయంగా ఆయనే రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో వసూళ్ల జరుగుతున్న తీరు ను చూస్తున్నారు.
ఆస్తుల యజమానులకు ముందుగా డిమాండ్ నోటీసులు జారీ చేయాలనిఆతర్వాతే కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు.
వసూలు చేసిన పన్ను మొత్తాలను సాయంత్రం సమయంలో కార్యాలయంలో జమ చేస్తారు, ఆ తర్వాత తన మరుసటి రోజు కార్యాచరణ ప్రణాళిక కోసం కనీసం 1 గంట కేటాయించాలని ఆయన బిల్ కలెక్టర్లను పురమాయిస్తున్నారు వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే తెలంగాణ మున్సిపల్ చట్టం-2019 ప్రకారం చర్యలు లకు సైతం కమీషనర్ దిలీప్ కుమార్ సిద్ధం అవుతున్నారు
