నగరంలోని ట్రాఫిక్ సమస్య పెరుగుతున్న నేపథ్యంలో నూడ చైర్మన్ కేశ వేణు వివిధ జంక్షన్ లలో ట్రాఫిక్ ఇబ్బందులను పరిశీలించి నూతన జంక్షన్ ల ఏర్పాటు కు ప్రతిపాదించారు.
మంగళవారం నిజామాబాద్ నుడ చైర్మన్ కేశ వేణు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్,ట్రాఫిక్ ఎసిపి నారాయణ , ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రవీణ్ లతో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక్ నగర,బోధన్ రోడ్,గౌతం నగర్, హైద్రాబాద్ బైపాస్ ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రదేశాలను పరిశీలించి వచ్చే వర్షాకాలంలో ఇబ్బంది లేకుండా నీళ్లు పోవడానికి పెద్ద నాళాలు నిర్మించాలనీ నిర్ణయించారు.
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు,పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు,బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముగ్గురి వల్ల నగరంలో స్మార్ట్ సిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వారి ఆధ్వర్యంలో నగరం అభివృద్ధి చెందుతున్నందుకు జిల్లా నగర ప్రజల తరుపున వారికి కృతజ్ఞతలు తెలిపారు.
