ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను ఖరారు చేసారు. ఆదివారం రాత్రి బీజేపీ పార్లమెంటరీ కమిటీ సమావేశం అయింది ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. .
ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ కమిటీ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొని అభ్యర్థి ఎంపికపై చర్చించారు.
అనంతరం ఎన్డీఏ కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా పని చేస్తోన్న సీపీ రాధాకృష్ణన్ పేరును ఖరారు చేశారు . అనంతరం ఎన్డీఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ పేరును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించారు.
ఆయన తమిళనాడు లోని కోయంబత్తూరు ఎంపీ గా రెండు పర్యాయాలు పనిచేసారు సీపీ రాధాకృష్ణన్ . గతంలో తెలంగాణ, జార్ఖండ్ గవర్నర్‌గా కూడా పని చేశారు. సీపీ రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడు.
2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు, సౌత్‌లో బీజేపీ బలోపేతమే లక్ష్యంగా బీజేపీ సీపీ రాధాకృష్ణన్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
