HomeCRIMEఒకటవ టౌన్ సీఐ బాధ్యతలు స్వీకరించిన రఘుపతి...

ఒకటవ టౌన్ సీఐ బాధ్యతలు స్వీకరించిన రఘుపతి…

నిజామాబాద్ ఒకటవ టౌన్ సిఐ గా బి.రఘుపతి గురువారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు.

ఇక్కడ ఒకటవ టౌన్ సిఐ గా విధులు నిర్వహించిన విజయ్ బాబు బోధన్ రూరల్ సీఐ గా బదిలీ కావడంతో హైదరాబాద్ ఐజి కార్యాలయంలో వెయిటింగ్ లిస్టులో ఉన్న రఘుపతి ఒకటవ టౌన్ సిఐ గా బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు.

మట్కా, గుట్కా, పేకాటకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తేలేదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కు కృషి చేస్తానన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments