మాక్లూర్ మండల ఎస్సై బదిలీపై వెళ్లడంతో, నూతన ఎస్సైగా రాజశేఖర్ బుధవారం బాధ్యతలు చేపట్టారు.
గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఎస్సై సుదీర్ రావు జగిత్యాలకు కి బదిలీ కావడంతో, బోధన్ రూరల్ ఎస్సైగా విధులు నిర్వహిస్తూన్న రాజశేఖర్ మాక్లూర్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు.
ఆయన మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేకంగా నిఘ ఉంచడం జరుగుతుందని, చోరీల నియంత్రణకు, జూదం, పేకాట,తదితరాల నియంత్రణపై ఉక్కుపాదం జరుగుతుందని తెలిపారు.
శాంతి భద్రతల పరిరక్షణ కు కృషి చేస్తానన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించని కోరారు.