నగరంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని మంగళవారం పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.మాట్లాడుతూ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు
ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆద్వర్యంలో నగరంలోని ఖిల్లా రోడ్డులో షేక్ అస్లం అనే వ్యక్తి ఎండుగంజాయిని విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు దాడులు నిర్వహించి అతనిని పట్టుకొని అరెస్టు చేసినట్లు తెలిపారు.
అతని నుంచి 260 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకునీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఈ దాడుల్లో సీఐ వెంకటేష్,ఎస్ఐ నరసింహ చారి,భూమాన్న,తదితరులు పాల్గొన్నారు.