కొడుకు సర్పంచిగా గెలుపొందిన ఆనందంలో తల్లి గుండెపోటుతో కుప్పకూలింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. రుద్రూర్ మండలం రానంపల్లి సర్పంచి ఎన్నికల్లో కొండలవాడి శంకర్ ఘన విజయం సాధించారు.
రుద్రూర్ మండలం రాణంపల్లి సర్పంచిగా కే.శంకర్ గెలుపొందాడు. గురువారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఆయన తల్లి లింగవ్వ ఛాతిలో నొప్పి వచ్చింది.
దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి
