జహీరాబాద్ లోకసభ టికెట్ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న డీసీసీబీ ఛైర్మెన్ భాస్కర్ రెడ్డి ఓటెద్దు పోకడలతో వేసారి పోయిన డైరెక్టర్లు తిరుబాటు చేసారు. పోచారం భాస్కర్ రెడ్డి ఫై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిన డైరెక్టర్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. మొదట 15 మంది డైరెక్టర్లు వెళ్లిపోగా తాజాగా మంగళవారం మరో ఇద్దరు సైతం అందుబాటులో లేకుండా పోయారు.
జిల్లాకు చెందిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వీరవిధేయుడే తిరుబాటు కథ నడుపుతున్నారని ప్రచారం జరుగుతుంది. డీసీసీబీ పాలకవర్గంలో తన పట్టు కోల్పయిన భాస్కర్ రెడ్డి రాజీనామకు సిద్ద పడ్డారు. తిరుబాటు బృందం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కి టచ్ లో ఉన్నారని సమాచారం. డీసీసీబీపాలక మండలిలో మొత్తం 20 మంది డైరెక్టర్లవుండగా మొదట 15 మంది డైరెక్టర్ల రమేష్ రెడ్డి నేతృత్వం లో మూడు రోజుల క్రితం అవిశ్వాస నోటీసులుఇచ్చారు డీసీసీబీ డైరెక్టర్లు అందరూ బిఆర్ యస్ పార్టీకి చెందిన వారే .
వచ్చే ఏడాది వరకు ఈ పాలక మండలి పదవి కాలం ఉంది. బిఆర్ యస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం నోరు మెదపని డైరెక్టర్లు అధికారం పోయిన వంద రోజులకే తిరుబాటు జెండా ఎత్తడం పార్టీలో కలకలం రేపింది. అదికూడా జిల్లా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండే ప్రశాంత్ రెడ్డి విధేయుడే రంగంలోకి దిగి ఛైర్మెన్ ఫై తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం అయ్యారు.నిజానికి పదవిలో వచ్చింది భాస్కర్ రెడ్డి డైరెక్టర్ లను కనీస మర్యాద ఇవ్వలేదు. కనీసం వారెవ్వరికి అందుబాటులోకూడా ఉండలేక పోయారు.
కానీ తండ్రి ప్రభుత్వంలో కీలకంగా ఉండడమతొ భాస్కర్ రెడ్డి వైఖరి మీద నోరెత్తేని పరిస్థితి .కానీ పార్టీ అధికారం కోల్పయింది ఈ నేపథ్యంలో తిరుబాటు చేసి సులువుగా గద్దె దించాలని ఆలోచనతో అవిశ్వాసం కోసం మద్దతు కూడగట్టారు.మొదట 15 మంది డైరెక్టర్లు ముందుకు రాగ మరో ఇద్దరు సైతం తాజాగా చేతులు కలిపారని సమాచారం. తనయుడి పదవీ కి ముప్పు రావడంతో దిద్దుబాటు చర్యలకు కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిగారు. డైరెక్టర్లు ను దారిలోకి తెచ్చుకోవడానికి యత్నించారు.
కానీ వారంతా ఇప్పటికే అజ్ఞాతంలో వెళ్లారు.అయితే అవిశ్వాసం నోటీసుఫై అధికారులు సైతం తదుపరి కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు. తిరుబాటు చేసిన డైరెక్టర్లు సహకారం కోసం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆశ్రయించారు.దీనితో దారులన్నీ మూసుకుపోవడం తో దిక్కుతోచని భాస్కర్ రెడ్డి రాజీనామా కు సిద్ధం అవుతున్నారు