బిఆర్ యస్ కాంగ్రెస్ లమధ్య అవినీతి బంధం బలంగా వుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఆయన సోమవారం సంగారెడ్డి లో జరిగిన విజయ సంకల్ప్ యాత్ర ముగింపు సభ లో మాట్లాడారు.తెలంగాణ లో కాంగ్రెస్ బిఆర్ యస్ లు కలిసే ఉన్నాయన్నారు.అది ప్రపంచానికి తెల్సు అన్నారు. కానీ ఈ బంధం ఎక్కువకాలం వుండదు.
తమకు కి సర్జికల్ స్ట్రైక్ తెలుసున్నారు.కాళేశ్వరం లో వేల కోట్ల రైతుల సొమ్ము లూటీ అయిందని బిఆర్ యస్ నేతల అవినీతి చూసి విసుగెత్తే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం అప్పగించారని కానీ వారు అవినీతి మీద విచారణ కూడా చేయడం లేదు. కాంగ్రెస్ లోని కొందరు నేతలు కూడా ఉన్నారు. ఓకే నాణానికి రెండు పార్టీలు చేరోవైపు ఉన్నాయన్నారు.జమ్మూకాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీలున్న చోట కుటుంబాలు బాగుపడ్డాయి.
కుటుంబవాద పార్టీలు ప్రజాస్వామ్యానికి శత్రువులు
పరివార వాదులకు చోరీ చేసేందుకు లైసెన్స్ ఉందా
వాళ్లకు కుటుంబం ఫస్ట్… నాకు దేశం ఫస్ట్
కాంగ్రెస్ బయటివారికి ఎవరికీ అవకాశం ఇవ్వదు
కుటుంబవాదులు సొంత ఖజానా నింపుకున్నారు.
మోదీ దేశఖజానా నింపాడు
నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు.
కుటుంబవాదులు మోదీపైనే దాడి చేస్తున్నారు
దేశంలో ప్రతి తల్లి, సోదరి, యువకులు, పిల్లలందరూ మోదీ కుటుంబమే
ఇందుకు అందరూ మోదీకా పరివార్ అని అంటున్నారు
నేను మోదీ కుటుంబం అని తెలంగాణ ప్రజలంటున్నారు
తెలంగాణప్రజల కలలు.. నా సంకల్పం
ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి దేశంలో గత 70 ఏళ్లలో జరగలేదు
నేను గ్యారెంటీ వ్యక్తిని.. గ్యారెంటీ పూర్తి చేయడం నాకు తెలుసుఘె
ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ వేశాంప్రపంచంలో దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామన్నారు. ఈ మాట కూడా నిలబెట్టుకుంటాం.. ఇది మోడీ గ్యారంటీ అన్నారు.
తాను రూ.వేల కోట్ల అవినీతిని బయటపెడుతున్నందుకే నాపై విమర్శలు చేస్తున్నారన్నారు. తాను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. కుటుంబ పాలన రాష్ట్రాలకు నష్టం చేస్తుందన్నారు.