తాను ముందే చెప్పినట్లుగానే పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయని ఎంపీ అర్వింద్ అన్నారు. రాబోయే రోజుల్లో పసుపు క్వింటాల్ ధర 20 వేల కు పైగా వస్తుందని అర్వింద్ భరోసా ఇచ్చారు ఆయన మంగళవారం జిల్లాకేంద్రంలోని శ్రద్ధానంద్ గంజ్ లో పసుపు అమ్మడానికి వచ్చిన రైతులతో ముఖాముఖీ అయ్యారు.
పసుపు మార్కెటింగ్ ను వారితో అడిగి తెలుసుకున్నారు. పసుపు ధర ను వాకబు చేశారు. పసుపు బోర్డు ను ఏర్పాటు చేసిన మోడీ సర్కార్ పసుపు ఎగుమతుల విషయంలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించిందన్నారు. రాబోయే రోజుల్లో బోర్డు అధికారులు మరింత దూకుడుగా వెళ్తారని బోర్డు పని ఇప్పుడిప్పేడే మొదలైందన్నారు.
పసుపు ఎగుమతులు 2030 నాటికి నాలుగు వందల శాతం పెంచేలా ప్రణాళికలు రూపొందుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తామని చెప్పింది పసుపు నుంచే రేవంత్ సర్కార్ ఆ పని చేయాలన్నారు. బోర్డు కు అవసరమైన సహకారం ఇవ్వాలని ఆయన కోరారు. రాబోయే రోజుల్లో పసుపు సాగు అంచనాలకు అందనంత గా పెరుగుతుందన్నారు.కాలువ లు లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినా ఘనత కెసిఆర్ కే దక్కిందన్నారు.






