విలీన గ్రామాలతో తన పరిధి విస్తరించుకున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అందుకు తగ్గట్టుగా ప్రజలకు మౌళిక సదుపాయాల ను ఎప్పుడో గాలికి వదిలేసింది. అవినీతి అలసత్వం వైఖరులతో కార్పొరేషన్ లో కార్యనిర్వహణ గాడి తప్పింది.
దశాబ్దకాలంగా ఐ ఏ యస్ లను కమిషనర్ లు నియమించినా సరే వారేమి ఉద్దరించలేక పోయారు. అధికార పార్టీ కనుసైరాలతో పనిచేయడానికి వారంతా పోటీ పడ్డారు అందుకే కార్పొరేషన్ సవాలక్ష సమస్యలతో సతమతం అవుతుంది. కార్పొరేషన్ కు ఆదాయం సమకూర్చే రెవెన్యూ విభాగం సైతం పూర్తిగా దారి తప్పింది.
గుట్టలుగా పేరుకపోయిన బకాయి లను వసూలు చేసుకోలేని దుస్థితి లో ఉంది. సుమారు 80 వేలకు పైగా వివాద రకాల సముదాయాలున్నాయి రూ వంద కోట్ల మేరకు ఆస్తి పన్ను వసూలు చేయాలి అందుకోసం ఎనిమిది మంది ఆర్ ఐ లు ఇద్దరు ఆర్వో లుండాలి కానీ ప్రస్తుతం నలుగురు ఆర్ ఐ లే ఉన్నారు అందులో ముగ్గురు వచ్చే నెలాఖరు లో పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దీనితో వారు వసూళ్ల విషయంలో కనీసం చొరవ చూపించలేక పోతున్నారు విరుకుడ్ ఈ మద్యే బదిలీ లల్లో నిజామాబాద్ కార్పొరేషన్ కు వచ్చారు అసలు తమకు కేటాయించిన ఏరియాల్లో ఆస్తి పన్ను రాబట్టే సముదాయాలను గుర్తించడంలోనే ఇంకా ఆపసోపాలు పడుతున్నారు.
దీనితో బకాయిలు గుట్టలుగా పేరుకు పోతున్నాయి.ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల మేరకు ఆస్థి పన్ను వసూలు కోసం లక్ష్యంగా ఉంటే తొమ్మది నెలలు గడిచిన కనీసం రూ 20 కోట్లు కూడా వసూళ్లు సాధించలేదు .
ఇతరవిబాగాల సంగతి ఎలా ఉన్న రెవెన్యూ విభాగం ఎలా దారి తప్పితే కార్పొరేషన్ పాలన మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం వుందనే ఆందోళన ఉద్యోగ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.
