Thursday, April 16, 2026
HomeCRIMEద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..ఒకరు మృతి

ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందినట్లు నందిపేట ఎస్ఐ శ్యామ్ రాజ్ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..

ఖుధావన్పూర్ కు చెందిన పోశెట్టి లక్ష్మి లు ఇద్దరు కలిసి బైక్ పై నిజామాబాద్ వెళ్తుండగా జోర్పూర్ నందిపేట్ శివారులో గల బంగారు మైసమ్మ గుడి వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో పోశెట్టి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

అలాగే గాయపడిన లక్ష్మీ నీ చికిత్స నిమిత్తం నిజామాబాదు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ మేరకు భార్య ఫిర్యాదు నిమిత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!